అతిథులు రావడమే తరువాయి
దర్బారు సిద్ధం
డేటోనా బీచ్, ఫ్లారిడా
ఆగస్టు 2008
Benches in the garden, installed in memory of some departed patron.
Daytona Beach, Florida
August 2008
డేటోనా బీచ్, ఫ్లారిడా
ఆగస్టు 2008
Benches in the garden, installed in memory of some departed patron.
Daytona Beach, Florida
August 2008
గగన నీలం పల్చబడింది
Posted by
కొత్త పాళీ
on Tuesday, October 28, 2008
చెట్టు కిందనించి ఆకాశంలోకి చూస్తే ..
డేటోనా బీచ్, ఫ్లారిడా
ఆగస్టు 2008
Daytona Beach, Florida
August 2008
డేటోనా బీచ్, ఫ్లారిడా
ఆగస్టు 2008
Daytona Beach, Florida
August 2008
వృక్షశాస్త్రం - పరాన్న భుక్కు
Posted by
కొత్త పాళీ
on Monday, October 27, 2008
ఈ చెట్టు కొమ్మల మీంచి జడలభూతం జడల్లా వేలాడుతున్న మొక్కని స్పేనిష్ మాస్ అంటారు. మనం హైస్కూలు వృక్షశాస్త్రంలో చదూకున్నట్టు ఇదొక పరాన్నభుక్కు, అంటే పేరసైట్.
డేటోనాబీచ్ దగ్గర్లో ఈ బొటానికల్ గార్డెన్ని వెతుక్కుంటూ వెళ్ళాం ఒక పూట. ఇంతా చేసి ఈ తోట ఉన్నది ఇరవయ్యెకరాలే. దీనికి అటూ ఇటూ సుబ్భరంగా ఇళ్ళ కాలనీలు అన్నీ ఉన్నాయి గానీ, ఈ తోటలో ఉన్నంత సేపూ మాత్రం ఏదో కీకారణ్యంలో ఉన్న భావన కలిగించింది.
డేటోనా బీచ్, ఫ్లారిడా
ఆగస్ట్ 2008
The hairy thing hanging from the tree branches is Spanish Moss. It is a parasite - meaning it takes ready made food from another living thing, like the host tree.
This was from an urban botanical garden, about 10 miles South of Daytona Beach, right in the middle of a residential neighborhood.
Daytona Beach, Florida
August 2008
కారులో షికారుకెళ్ళే ..
Posted by
కొత్త పాళీ
on Friday, October 24, 2008
డేటోనా 500 రేస్ ట్రాక్
ఇవి ఉత్తుత్తి రేస్ కార్లు. అభిమానులు తగిన ముడుపు చెల్లిస్తే దీంట్లో కూర్చోపెట్టి రేస్ చేసినట్టుగా రేస్ ట్రాక్ మీద ఒక నాలుగు చుట్లు తిప్పి తీసుకొస్తారు. ఇంకా ఎక్కువ ముడుపు కడితే మనల్నే కారు తోలనిస్తారు. రేస్ ట్రాక్ మీద నడపవలసిన కనిష్ఠ వేగం గంటకి 150 మైళ్ళు. ఈ కార్లు సుమారు దానికి రెండింతలు వేగంగా వెళ్ళగలవు.
డేటోనాబీచ్, ఫ్లారిడా
2008 ఆగస్టు

Daytona 500 Racetrack
These are dummy race cars. Fans can ride in them by paying a fees. For a higher fees, they let you drive the car on the track. The minimum speed one can drive the car on the track is about 150 mph. The cars are capable of going twice as fast.
Daytona Beach, Florida
August 2008
శరచ్చంద్రోదయం
Posted by
కొత్త పాళీ
on Tuesday, October 21, 2008
ఒక వేసవి సాయంత్రం పున్నమి చంద్రుడు నార్త్ కేంపస్ మీద ఉదయిస్తున్న దృశ్యం. ఎడమ వేపుకి ఉన్నది గంట స్తంభం 1996 లో కట్టారు. దీని శిఖరాన గంటలు వాయించే యంత్రం అమర్చారు. ప్రతి పావు గంటకీ శ్రావ్యంగా సమయం తెలపడమే కాక శనాది వారాల్లో ఒక అరగంట సేపు గంటల వాద్య కచేరి చేస్తుంటుంది ఇది. కుడివేపున కనిపిస్తున్నది మీడియా యూనియన్ భవనం. దీనిలో ఇంజనీరింగ్ లైబ్రరీ, కంప్యూటరు లాబులు ఉన్నాయి.
గడియారం స్తంభం
Posted by
కొత్త పాళీ
on Monday, October 20, 2008
ఇది మిషిగన్ విశ్వవిద్యాలయపు సెంట్రల్ కేంపస్ నడిబొడ్డున ఉంది. బొమ్మలో ఎడమ పక్కగా ప్రఖ్యాతి వహించిన హిల్ ఆడిటోరియం కొద్దిగా కనిపిస్తోంది.
ఏనార్బర్ శిల్పాలు 7
Posted by
కొత్త పాళీ
on Sunday, October 19, 2008
చెలరేగే కొమ్ము గుర్రం (Rampant Unicorn)
డెట్రాయిట్ పరిసర ప్రాంతాల్లోని బ్లూంఫీల్డ్ హిల్స్ అనే చిన్నఊళ్ళో, క్రాన్‌బ్రూక్ ఎకాడెమీ అనే ప్రఖ్యాతి గాంచిన కళా పాఠశాల ఉంది. అక్కడ శిల్ప విభాగానికి అధిపతిగా పని చేసిన బెర్థోల్డ్ షివెట్జ్ గారు ఈ కంచు శిల్ప నిర్మాత. ఇది మిషిగన్ లీగ్ భవనం పక్కనే ఉంది.
ఏనార్బర్ శిల్పాలు 4
Posted by
కొత్త పాళీ
on Thursday, October 16, 2008
రీజెనెరేషన్ ఆఫ్ టైమ్ (Regeneration of Time)
ఈ శిల్పం, విశ్వవిద్యాలయపు వైద్య కళాశాల భవనాల మధ్యలో, నగరపు ఒక ప్రధాన కూడలిలో ఉంది. విశ్వవిద్యాలయ కళావిభాగంలో ఆచార్యులైన లూయీ మారినారో ఈ కాంస్య విగ్రహ శిల్పాన్ని సృష్టించి పోత పోశారు. ఇది ప్రత్యేకముగా వైద్యకళాశాల ముఖ్యంగా చేసే రెండు పనులకి .. వైద్య విద్యా బోధ, వైద్య సేవ .. రెంటికీ ప్రతీకగా మలచబడిందని శిల్పి ఉవాచ.
ఈ శిల్పానికి మరి కొన్ని దృక్కోణాలు రేపు.
ఏనార్బర్ శిల్పాలు 3
Posted by
కొత్త పాళీ
on Wednesday, October 15, 2008
విశ్వవిద్యాలయంలో విద్యార్ధి కార్యకలాపాలకి ఆటపట్టు అనదగిన మిషిగన్ యూనియన్ అనే 19va శతాబ్ది భవంతి పక్కన చప్టాచేసిన జాగాలో ఉంటుంది ఈ ఆధునిక శిల్పం. మామూలుగా చూడ్డానికే ఈ కింది కొన మీద ఎలా నిలబడి ఉందా అని విభ్రాంతి కలిగిస్తోంది కదా .. ఇంకాస్తి విభ్రాంతి కలిగించే విషయం. అది ఆ మొన మీద మోపి ఉండడమే కాదు, ఆ ఇరుసు మీద గుండ్రంగా తిరుగుతుంది కూడా. పరీక్షలకి ముందు ఈ క్యూబుని ఒక చుట్టు తిప్పడం ఇక్కడి విద్యార్ధులు అదృష్టకరంగా భావిస్తారు.
ఏనార్బర్ శిల్పాలు 2
Posted by
కొత్త పాళీ
on Tuesday, October 14, 2008
మిషిగన్ లీగ్ భవనానికి ఆనుకుని ఉన్న చిన్న సావడి లాంటి చోటులో ఈ చిన్న శిల్పం ఉంది. చేప మీద విలాసంగా పడుకుని ఉన్న ఒక స్త్రీమూర్తి రూపించబడిన ఈ శీల్పాన్ని సాగర అప్సర (Sea Nymph) అని పిలుస్తారు. క్లివియా మారిసన్ అనే కళాకారిణి సెరామిక్ మట్టి నించి ఈ శిల్పాన్ని మలచారు.
ఏనార్బర్ శిల్పాలు 1
Posted by
కొత్త పాళీ
on Monday, October 13, 2008
క్రమం తప్పకుండా రోజుకో బొమ్మ ఇక్కడ వెలువరించాలనే సత్సంకల్పంతో ఈ బ్లాగు మొదలు పెట్టాను. తగినన్ని బొమ్మలు కూడా ఉన్నాయి, కానీ, ఒక్కోసారి వాటిని వెదికి చిన్న వ్యాఖ్య రాసేందుకు అవసరమైన పది నిమిషాల వ్యవధి కూడా దొరక్క ఇక్కడ కొత్త బొమ్మలు ప్రచురించ లేక పోతున్నాను.
ఇకనించీ అయినా క్రమం తప్పకుండా ప్రచురించ గలనని ఆశ. ఆసకి అంతేవుంది? :)
ఏనార్బర్ నగరంలో ప్రజల ఆనందం కోసం బహిరంగ ప్రదేశాల్లో అక్కడక్కడా ఏర్పాటు చెయ్యబడిన శిల్పాలని పరిచయం చేస్తాను. అమెరికాలో అనేక నగరాల్లో ఇటువంటి బహిరంగ శిల్పాల్ని నగరపాలక సంస్థలుగానీ, లేక అక్కడ స్థానిక బలం ఉన్న వాణిజ్య సంస్థలు గానీ నెలకొల్పుతూ ఉండడం పరిపాటి. ఈ వరుసలో కనిపించే శిల్పాలన్నిటినీ మిషిగన్ విశ్వవిద్యాలయం వారు నెలకొల్పారు.
ఈ బొమ్మలన్నీ 2002 ప్రాంతంలో కొన్ని సార్లు పని గట్టుకుని కేంపస్ పర్యటన చేసి తీశాను.
కొడుకులూ కూతుళ్ళూ ఇతర జలచరాలతో గ్రీకు దేవుడు ట్రైటాన్. కార్ల్ మిల్లే అనే స్వీడిష్ శిల్పకారుడి సృష్టి.
ఇది కంచులో పాత పోసిన జలయంత్రం (ఫౌంటెన్). వసంతం నించీ హేమంతం దాకా నీళ్ళు చిమంతుంటుంది. చలకాలంలో నీళ్ళు కట్టేస్తారు.
Read more