శరచ్చంద్రోదయం
ఒక వేసవి సాయంత్రం పున్నమి చంద్రుడు నార్త్ కేంపస్ మీద ఉదయిస్తున్న దృశ్యం. ఎడమ వేపుకి ఉన్నది గంట స్తంభం 1996 లో కట్టారు. దీని శిఖరాన గంటలు వాయించే యంత్రం అమర్చారు. ప్రతి పావు గంటకీ శ్రావ్యంగా సమయం తెలపడమే కాక శనాది వారాల్లో ఒక అరగంట సేపు గంటల వాద్య కచేరి చేస్తుంటుంది ఇది. కుడివేపున కనిపిస్తున్నది మీడియా యూనియన్ భవనం. దీనిలో ఇంజనీరింగ్ లైబ్రరీ, కంప్యూటరు లాబులు ఉన్నాయి.
2 comments:
ఆ:-క్రొత్త పాళి చూపె క్రొంగ్రొత్త దౌ శరత్
చంద్ర కాంతి మాకు చక్కగాను.
అమెరికాకు పోయి యచట చూచినయట్లు
తోచుచుండె మదిని దోచుచుండె.
బ్యూటీ! నిజంగానే అక్కడి చంద్రుణ్ణి ఇక్కడ చూపించారు. నెనర్లు!
Post a Comment