ఓ మేఘమాలా! - 4



ఇది నేను ఆఫీసుకి వెళ్ళే రోడ్డు మీద కార్లోంచి తీసినది
Read more

ఓ మేఘ మాలా! - 3



I call this "One way ticket to Chicago"!
This is the train track that goes form Ann Arbor (Michigan) to Chicago.
Read more

ఓ మేఘమాలా! - 2

Read more

ఓ మేఘ మాలా! - 1



ఆగస్టు సెప్టెంబరు కాలంలో మిషిగన్ లో దూది కొండల్లా తేలి పోతున్న మేఘాలు భలే అందంగా ఉంటాయి.
Read more

ఆటవా మ్యునిసిపల్ కార్పొరేషన్



ఒక రాత్రి భోజనం చేసి హోటల్ కి తిరిగి వస్తూ, ఆటవా నగరపాలిక కార్యాలయం ముందు.
ఆ ఘోర శిశిరంలో చెట్లన్నీ రంగు దీపాల్ని పుష్పించాయి.
డిశెంబరు 2007

In front of Ottawa Municipal Corporation
December 2007
Read more

కెనడా జాతీయ కళా ప్రదర్శన శాల



కెనడా జాతీయ కళా ప్రదర్శన శాల,
ఆటవా, డిశెంబరు 2007

Canadian National Art Gallery
Ottawa, December 2007
Read more

మమ్మీ మమ్మీ మాడర్న్ ఆర్ట్!



కెనడా జాతీయ కళా ప్రదర్శన శాలలో
ఒక ఆధునిక కళాఖండం
డిశెంబరు 2007

A Modern art display in Canadian National Art Gallery
December 2007
Read more

లలిత కళారాధనలో!



ప్రాచీన ఐరోపీయ
చిత్రకళని ఆస్వాదిస్తూ
నిబిడాశ్చర్యంతో
నేనే!

కెనడా జాతీయ కళాప్రదర్శన శాల
డిశెంబరు 2007

In the gallery dedicated to medieval European art
It's me!
Canadian National Art Gallery
December 2007
Read more

ఆటవా ఓ ఆటవా



A giant sculpture of a spider in cast bronze
outside Canadian National Art Gallery
Ottawa, December 2007
Read more

ఇంకొక పాతంలో చాపం



మళ్ళీ ఇంద్ర ధనుసు, ఈసారి గుర్రపునాడా ఫాల్సులో.
అంత నీరు తుంపరగా రేగుతుంటే ఇంద్ర ధనుసుల కేమి కొదవ?
నయాగరా జలపాతం
మే 2005

Rainbow in the Horseshoe Falls
May 2005
Read more

పాతంలో చాపం



అమెరికన్ ఫాల్సులో .. పడవ మీంచి
నయాగరా జలపాతం
మే 2005

Rainbow in American Falls
Niagara
May 2005
Read more

గుర్రపు నాడా జలపాతం - 2



అగాథంలో మెయిడ్ ఆఫ్ ది మిస్ట్ పడవ నించి
నయాగరా జలపాతం
మే 2005

A view of Horseshoe Falls form the deck of the boat Maid of the Mist
Niagara
Ma 2005
Read more

రెండు జలపాతాలు



ఒకే దృశ్యంలో రెండు జలపాతాలూనూ
నయాగరా జలపాతం
మే 2005

American Falls (in the foreground) and Horseshoe Falls
Niagara
May 2005
Read more

గుర్రపునాడా జలపాతం - 1



నయాగరా జలపాతం నిజానికి పక్క పక్కనే ఉన్న రెండు జలపాతాలు అని ఇదివరకు చెప్పాను. అందులో చిన్న పాయ ఐన అమెరికను జలపాతాన్ని ఇంతకు ముందుటి ఫొటోల్లో చూశాము. ముఖ్యమైన గుర్రపు నాడా జలపాతం ఇదే. ఈ జలపాతం సరిహద్దుకి కెనడా వైపున ఉన్నది. కాకపోతే నయాగరా నది ఒక ఒడ్డు అమెరికాలో ఉంది కాబట్టి, అక్కణ్ణించి కూడా దూరాన్నించి చూడచ్చు. జలపాతపు ఉధృతం వల్ల దట్టమైన పొగమంచు లాగా పైకి లేచే నీటి తుంపర మబ్బుల వల్ల, భూ ఉపరి తలం నుండి చూస్తే నిజంగా జలపాతం ఏంఈ కనబడదు. దీని పూర్తి స్వరూపాన్ని దర్శించాలంటే కెనడా వైపున ఉన్న ఎత్తైన స్తూపం ఎక్కి చూడాల్సిందే!

ఈ ఫొటో అమెరికా వైపున్న అబ్సర్వేషను స్తంభం మీదినుండి తీసినది. కింద అగాథంలో అమెరికా నించీ కెనడా నించీ జలపాతం పతన ప్రదేశానికి తీసుకు వెళ్ళే "మెయిడ్ ఆఫ్ ది మిస్ట్" పడవలు రెంటినీ చూడచ్చు.
మే 2005

Horseshoe Falls (Niagara Falls)
As seen from the observation tower on American side
May 2005
Read more

టవర్



ఈ స్తంభం అమెరికా వేపున ఉన్నది. ఆ స్తంభంలో అగాథం కిందికి చేరేందుకు లిఫ్టు ఉంది. ఆ స్తంభం దగ్గర్నించి అగాథంలో "మెయిడ్ ఆఫ్ ది మిస్ట్" అనే పడవ నడుపుతారు. ఈ పడవలో రెండు జలపాతాల పతన భాగాల దగ్గరికి వెళ్ళి చూడచ్చు. నీటి ఉధృతం, తుంపర వలన మరీ దగ్గరగా వెళ్ళలేము, సుమారు రెండొందల గజాల దూరం నించి చూడచ్చు. ఇటువంటి సదుపాయమే కెనడా వైపున కూడా ఉంది. ఈ బొమ్మ పడవలోనించి తీసినది. స్తంభానికి వెనక పక్క అమెరికన్ ఫాల్స్ కనబడుతున్నాయి.
మే 2005

Observation walkway and elevator tower on the American side
Niagara Falls
May 205
Read more

అమెరికన్ ఫాల్స్ - 3



A strip of American Falls
From near the edge
May 2005
Read more

అమెరికన్ ఫాల్స్ - 2



అమెరికన్ ఫాల్స్
అగాథం అడుగు నించి
మే 2005

American Falls
From the bottom of the gorge
May 2005

(click on the picture to see the larger original to get a feel for the immensity of the falls)
Read more

అమెరికన్ ఫాల్స్ - 1



నయాగరా జలపాతం రెండు ముఖ్య జలపాతాలుగా ఉంది. ఎక్కువగా బొమ్మల్లో కనిపించేదాన్ని గుర్రపు నాడా జలపాతం (Horseshoe Falls) అంటారు, పైనుంచి చూస్తే ఇది సుమారు అర్ధచంద్రాకృతిలో ఒక గుర్రపునాడాలాగా ఉండటం వలన. ఇదిసరిహద్దుకి కెనడా వైపున ఉంది.

ఈ బొమ్మలో కనబడుతున్నది అమెరికన్ ఫాల్స్. ఇది సరిహద్దుకి అమెరికన్ వేపున ఉంది. ఇంచుమించు ఒక తిన్నటి తీరం వెంబడి నీరు ఒక దట్టమైన తెరలాగా కిందకి పడిపోతూ ఉంటుంది. మనం జలపాతానికి పై తలంలో దాన్ని సమీపిస్తాము, అంచేత దాని ఉధృతం మనకి వెంటనే అర్ధం కాదు. లిఫ్టులో అగాథం అడుగుకి దిగి, కిందనించి జలపాతాన్ని చూస్తే, టన్నుల నీరు దుముకుతున్న హోరు వొళ్ళు జలదరింప చేస్తుంది. భగీరథుడు గంగని దివినించి భువికి దింపినప్పుడు బహుశా ఇలాగే ఉందేమో ననిపిస్తుంది.
మే 2005

The American Falls
May 2005
Read more

నయాగరా నది



ఒంటారియో సరస్సునీ ఈరీ సరస్సునీ కలిపే చిన్న నీటి పాయని నయాగరా నది అంటారు. ఈ నది ప్రవహించే దారిలో, ఇంచుమించు రెండు సరస్సులకీ మధ్యలో, ఒక పెద్ద అగాథం ఉండి అదే ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన నయాఅరా జలపాతంగా ప్రఖ్యాతి గాంచింది.

ఈ నయాగరా నది కెనడాలోని ఒంటారియో రాష్ట్రానికీ, అమెరికాలోని న్యూయార్కు రాష్ట్రానికీ సరిహద్దులో ఉంది.

ఈ బొమ్మలో కనిపించేది జలపాతంలోకి దుమికేందుకు ఉరకలు వేస్తున్న నయాగరా నది.
మే 2005

Niagara river is a small strip of water that joins Lake Ontario and Lake Erie. A natural schism in its path has created one of the Seven Wonders of the world, the Niagara Falls.

Niagara river flows on the border between Ontario province in Canada and New York state in the USA.

The water you see in this picture is the Niagara river just upstream from the Falls.
May 2005
Read more