అమెరికన్ ఫాల్స్ - 1



నయాగరా జలపాతం రెండు ముఖ్య జలపాతాలుగా ఉంది. ఎక్కువగా బొమ్మల్లో కనిపించేదాన్ని గుర్రపు నాడా జలపాతం (Horseshoe Falls) అంటారు, పైనుంచి చూస్తే ఇది సుమారు అర్ధచంద్రాకృతిలో ఒక గుర్రపునాడాలాగా ఉండటం వలన. ఇదిసరిహద్దుకి కెనడా వైపున ఉంది.

ఈ బొమ్మలో కనబడుతున్నది అమెరికన్ ఫాల్స్. ఇది సరిహద్దుకి అమెరికన్ వేపున ఉంది. ఇంచుమించు ఒక తిన్నటి తీరం వెంబడి నీరు ఒక దట్టమైన తెరలాగా కిందకి పడిపోతూ ఉంటుంది. మనం జలపాతానికి పై తలంలో దాన్ని సమీపిస్తాము, అంచేత దాని ఉధృతం మనకి వెంటనే అర్ధం కాదు. లిఫ్టులో అగాథం అడుగుకి దిగి, కిందనించి జలపాతాన్ని చూస్తే, టన్నుల నీరు దుముకుతున్న హోరు వొళ్ళు జలదరింప చేస్తుంది. భగీరథుడు గంగని దివినించి భువికి దింపినప్పుడు బహుశా ఇలాగే ఉందేమో ననిపిస్తుంది.
మే 2005

The American Falls
May 2005

2 comments:

Ramani Rao said...

చాలా బాగుంది. నిజానికి నేను ఇంత హోరు జలపాతాలని చూడలేదు ఇలా ఫొటోల్లో, సినిమాల్లో తప్ప. వైజాగ్ బీచ్ దగ్గిర అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతుంటే భయమేసి పిల్లలిని నీటిదగ్గరికి కూడా వెళ్ళనివ్వలేదు." ఆడుకోడానికి వెళ్తాము, దూరం నుంచే చూస్తాము" అన్నా ఎంటో అసలు ధైర్యం లేదు, అక్కడ మా చుట్టాలింట్లో ఉదయాన్నే కిటికిలోంచి సముద్రాన్ని చూస్తూ ఆనందించేదాన్ని.

కొత్త పాళీ said...

అప్పుడే ఏమయ్యింది .. నయాగరా ఇప్పుడే మొదలయ్యింది :)