గుర్రపునాడా జలపాతం - 1



నయాగరా జలపాతం నిజానికి పక్క పక్కనే ఉన్న రెండు జలపాతాలు అని ఇదివరకు చెప్పాను. అందులో చిన్న పాయ ఐన అమెరికను జలపాతాన్ని ఇంతకు ముందుటి ఫొటోల్లో చూశాము. ముఖ్యమైన గుర్రపు నాడా జలపాతం ఇదే. ఈ జలపాతం సరిహద్దుకి కెనడా వైపున ఉన్నది. కాకపోతే నయాగరా నది ఒక ఒడ్డు అమెరికాలో ఉంది కాబట్టి, అక్కణ్ణించి కూడా దూరాన్నించి చూడచ్చు. జలపాతపు ఉధృతం వల్ల దట్టమైన పొగమంచు లాగా పైకి లేచే నీటి తుంపర మబ్బుల వల్ల, భూ ఉపరి తలం నుండి చూస్తే నిజంగా జలపాతం ఏంఈ కనబడదు. దీని పూర్తి స్వరూపాన్ని దర్శించాలంటే కెనడా వైపున ఉన్న ఎత్తైన స్తూపం ఎక్కి చూడాల్సిందే!

ఈ ఫొటో అమెరికా వైపున్న అబ్సర్వేషను స్తంభం మీదినుండి తీసినది. కింద అగాథంలో అమెరికా నించీ కెనడా నించీ జలపాతం పతన ప్రదేశానికి తీసుకు వెళ్ళే "మెయిడ్ ఆఫ్ ది మిస్ట్" పడవలు రెంటినీ చూడచ్చు.
మే 2005

Horseshoe Falls (Niagara Falls)
As seen from the observation tower on American side
May 2005

0 comments: