వృక్షశాస్త్రం - పరాన్న భుక్కు



ఈ చెట్టు కొమ్మల మీంచి జడలభూతం జడల్లా వేలాడుతున్న మొక్కని స్పేనిష్ మాస్ అంటారు. మనం హైస్కూలు వృక్షశాస్త్రంలో చదూకున్నట్టు ఇదొక పరాన్నభుక్కు, అంటే పేరసైట్.
డేటోనాబీచ్ దగ్గర్లో ఈ బొటానికల్ గార్డెన్ని వెతుక్కుంటూ వెళ్ళాం ఒక పూట. ఇంతా చేసి ఈ తోట ఉన్నది ఇరవయ్యెకరాలే. దీనికి అటూ ఇటూ సుబ్భరంగా ఇళ్ళ కాలనీలు అన్నీ ఉన్నాయి గానీ, ఈ తోటలో ఉన్నంత సేపూ మాత్రం ఏదో కీకారణ్యంలో ఉన్న భావన కలిగించింది.
డేటోనా బీచ్, ఫ్లారిడా
ఆగస్ట్ 2008

The hairy thing hanging from the tree branches is Spanish Moss. It is a parasite - meaning it takes ready made food from another living thing, like the host tree.
This was from an urban botanical garden, about 10 miles South of Daytona Beach, right in the middle of a residential neighborhood.
Daytona Beach, Florida
August 2008

3 comments:

Anonymous said...

Excellent pic, aa chepptu kooda chala bavundi,

Purnima said...

మంచి సమాచారం! ఫొటో కూడా బాగుంది.

రానారె said...

మాస్టారూ,

స్పానిష్ మోస్ (గ్రేబెయర్డ్ లేదా ముదుసలిగడ్డం) మీద మీరు పెద్ద అభాండం వేశారు. అది పరాన్నజీవి కాదు పాపం. దీనికి వేళ్లు లేవు. గాలిలోని నీటితడి నుంచి పోషకాలను గ్రహిస్తుందిట. అందుకు అనువుగా వుంటుందని మాత్రమే అది పొడవాటి చెట్లను ఆశ్రయిస్తుంది తప్ప, వేరే దురుద్దేశం లేదంట. ఇది ఆర్ధ్రత ఎక్కువగా వుండే నదీతీర సముద్రతీర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దాన్నేమైనా అనాలనుకుంటే epiphyte లేదా air plant అనొచ్చట.

మా ఆఫీసుచుట్టూ ఉన్న చెట్లపైనుంచి వేలాడుతూ కనిపిస్తూవుంటే ఒకరోజు దాని సంగతేమిటో ఇక్కడి ఒకాయన్ను అడిగి కనుక్కున్నాను. గూగులమ్మ చెప్పిన చిత్రమేమనగా ఇది పైన్‌ఆపిల్ కుటుంబానికి చెందిన మొక్క. దీనికి పూలు కూడా పూస్తాయట! కానీ నేనెప్పుడూ గుర్తించలేదు.