ఏనార్బర్ శిల్పాలు 2



మిషిగన్ లీగ్ భవనానికి ఆనుకుని ఉన్న చిన్న సావడి లాంటి చోటులో ఈ చిన్న శిల్పం ఉంది. చేప మీద విలాసంగా పడుకుని ఉన్న ఒక స్త్రీమూర్తి రూపించబడిన ఈ శీల్పాన్ని సాగర అప్సర (Sea Nymph) అని పిలుస్తారు. క్లివియా మారిసన్ అనే కళాకారిణి సెరామిక్ మట్టి నించి ఈ శిల్పాన్ని మలచారు.

6 comments:

Unknown said...

కొత్తపాళీగారూ,

"సావడి", యిది "చావిడి" నేనా లేక మరేదైనానా?

కొత్త పాళీ said...

@చంద్ర శేఖర్. అదేనండీ. కొత్తపరిభాషలో పోర్టికో అంటాము.

Purnima said...

బాగుంది!

Unknown said...

కొత్తపాళీ గారూ,

మీరు నన్ను అండీ అని సంభోధించటమేంబాలేదండీ.

యికపోతే, మేము "పోర్టికో"ని "పంచ" అంటాము. అదే మా పెద్దామ్మవాళ్ళ ఊరు పెదనందిపాడులో అయితే "చావిడి"ని "కొష్ఠం" అంటారు.

మేము చావిడి అనేది గేదెలు కట్టేయడానికి వాడే గుడిశెని. అదే యింటికి చూరు దించితే మాత్రం "పంచ" అనే వాడతాం.

Anonymous said...

interesting photos! good thought in posting the description of the art too!

కొత్త పాళీ said...

చంద్ర శేఖర్, పంచ, కోష్ఠం (కొట్టం), ఇవన్నీ నాకూ పరిచయమున్న పదాలే. నేను పల్లెటూరి వాణ్ణి కాదు గనక, వాడుకలో వీటిని పర్యాయపదాలుగా వాడేస్తుంటాను. బహుశా అంధ్రదేశంలోని ఇత్యర మండలాల్లో వాడుక వేరేగా ఉండొచ్చు, అసలు వేరే పదాలే ఉండొచ్చు వాటికి.
రాణి గారూ, నా బొమ్మla బ్లాగుకొచ్చినందుకు సంతోషం