Showing posts with label శిల్పం. Show all posts
Showing posts with label శిల్పం. Show all posts
ఏనుగమ్మ ఏనుగు
విశాఖ ఆర్కె బీచి ఉత్తరపు అంచున ఆంధ్రవిశ్వవిద్యాలయం కళా విభాగం వారు నిర్మించిన నిలువెత్తు ఏనుగు బొమ్మ.
జూన్ 2009
Life size sculpture of a bull elephant, made and installed by Fine Arts Department of Andhra University.
Vizag, June 2009
లెనిన్!

బహుశా ప్రపంచం మొత్తమ్మీద ఇంకా నిలిచి ఉన్న లెనిన్ శిలాప్రతిమ ఇదొక్కటేనేమో!
కమ్యూనిస్టులు నగరపాలన చేసిన సమయంలో ఈ బుల్లి పార్కు తయారు చేసి ఈ ప్రతిమని ప్రతిష్ఠించి ఈ ప్రదేశానికి లెనిన్ సెంటరు అని నాఅకరణం చేశారు.
నేడు ప్రతిమ అయితే ఇంకా నిలిచి ఉంది కానీ ఆ బుల్లి పార్కు పందుల దొడ్డిలాగా ఉంది, అతి ఘోరంగా, నగరం నడిబొడ్డున!
Lenin Statue
Governor Pet, Vijayawada, January 2007
ఏనార్బర్ శిల్పాలు 7
Posted by
కొత్త పాళీ
on Sunday, October 19, 2008

చెలరేగే కొమ్ము గుర్రం (Rampant Unicorn)
డెట్రాయిట్ పరిసర ప్రాంతాల్లోని బ్లూంఫీల్డ్ హిల్స్ అనే చిన్నఊళ్ళో, క్రాన్‌బ్రూక్ ఎకాడెమీ అనే ప్రఖ్యాతి గాంచిన కళా పాఠశాల ఉంది. అక్కడ శిల్ప విభాగానికి అధిపతిగా పని చేసిన బెర్థోల్డ్ షివెట్జ్ గారు ఈ కంచు శిల్ప నిర్మాత. ఇది మిషిగన్ లీగ్ భవనం పక్కనే ఉంది.
ఏనార్బర్ శిల్పాలు 4
Posted by
కొత్త పాళీ
on Thursday, October 16, 2008

రీజెనెరేషన్ ఆఫ్ టైమ్ (Regeneration of Time)
ఈ శిల్పం, విశ్వవిద్యాలయపు వైద్య కళాశాల భవనాల మధ్యలో, నగరపు ఒక ప్రధాన కూడలిలో ఉంది. విశ్వవిద్యాలయ కళావిభాగంలో ఆచార్యులైన లూయీ మారినారో ఈ కాంస్య విగ్రహ శిల్పాన్ని సృష్టించి పోత పోశారు. ఇది ప్రత్యేకముగా వైద్యకళాశాల ముఖ్యంగా చేసే రెండు పనులకి .. వైద్య విద్యా బోధ, వైద్య సేవ .. రెంటికీ ప్రతీకగా మలచబడిందని శిల్పి ఉవాచ.
ఈ శిల్పానికి మరి కొన్ని దృక్కోణాలు రేపు.
ఏనార్బర్ శిల్పాలు 3
Posted by
కొత్త పాళీ
on Wednesday, October 15, 2008
విశ్వవిద్యాలయంలో విద్యార్ధి కార్యకలాపాలకి ఆటపట్టు అనదగిన మిషిగన్ యూనియన్ అనే 19va శతాబ్ది భవంతి పక్కన చప్టాచేసిన జాగాలో ఉంటుంది ఈ ఆధునిక శిల్పం. మామూలుగా చూడ్డానికే ఈ కింది కొన మీద ఎలా నిలబడి ఉందా అని విభ్రాంతి కలిగిస్తోంది కదా .. ఇంకాస్తి విభ్రాంతి కలిగించే విషయం. అది ఆ మొన మీద మోపి ఉండడమే కాదు, ఆ ఇరుసు మీద గుండ్రంగా తిరుగుతుంది కూడా. పరీక్షలకి ముందు ఈ క్యూబుని ఒక చుట్టు తిప్పడం ఇక్కడి విద్యార్ధులు అదృష్టకరంగా భావిస్తారు.
ఏనార్బర్ శిల్పాలు 2
Posted by
కొత్త పాళీ
on Tuesday, October 14, 2008

మిషిగన్ లీగ్ భవనానికి ఆనుకుని ఉన్న చిన్న సావడి లాంటి చోటులో ఈ చిన్న శిల్పం ఉంది. చేప మీద విలాసంగా పడుకుని ఉన్న ఒక స్త్రీమూర్తి రూపించబడిన ఈ శీల్పాన్ని సాగర అప్సర (Sea Nymph) అని పిలుస్తారు. క్లివియా మారిసన్ అనే కళాకారిణి సెరామిక్ మట్టి నించి ఈ శిల్పాన్ని మలచారు.
ఏనార్బర్ శిల్పాలు 1
Posted by
కొత్త పాళీ
on Monday, October 13, 2008
క్రమం తప్పకుండా రోజుకో బొమ్మ ఇక్కడ వెలువరించాలనే సత్సంకల్పంతో ఈ బ్లాగు మొదలు పెట్టాను. తగినన్ని బొమ్మలు కూడా ఉన్నాయి, కానీ, ఒక్కోసారి వాటిని వెదికి చిన్న వ్యాఖ్య రాసేందుకు అవసరమైన పది నిమిషాల వ్యవధి కూడా దొరక్క ఇక్కడ కొత్త బొమ్మలు ప్రచురించ లేక పోతున్నాను.
ఇకనించీ అయినా క్రమం తప్పకుండా ప్రచురించ గలనని ఆశ. ఆసకి అంతేవుంది? :)
ఏనార్బర్ నగరంలో ప్రజల ఆనందం కోసం బహిరంగ ప్రదేశాల్లో అక్కడక్కడా ఏర్పాటు చెయ్యబడిన శిల్పాలని పరిచయం చేస్తాను. అమెరికాలో అనేక నగరాల్లో ఇటువంటి బహిరంగ శిల్పాల్ని నగరపాలక సంస్థలుగానీ, లేక అక్కడ స్థానిక బలం ఉన్న వాణిజ్య సంస్థలు గానీ నెలకొల్పుతూ ఉండడం పరిపాటి. ఈ వరుసలో కనిపించే శిల్పాలన్నిటినీ మిషిగన్ విశ్వవిద్యాలయం వారు నెలకొల్పారు.
ఈ బొమ్మలన్నీ 2002 ప్రాంతంలో కొన్ని సార్లు పని గట్టుకుని కేంపస్ పర్యటన చేసి తీశాను.

కొడుకులూ కూతుళ్ళూ ఇతర జలచరాలతో గ్రీకు దేవుడు ట్రైటాన్. కార్ల్ మిల్లే అనే స్వీడిష్ శిల్పకారుడి సృష్టి.
ఇది కంచులో పాత పోసిన జలయంత్రం (ఫౌంటెన్). వసంతం నించీ హేమంతం దాకా నీళ్ళు చిమంతుంటుంది. చలకాలంలో నీళ్ళు కట్టేస్తారు.
Read more

ఆటవా ఓ ఆటవా

A giant sculpture of a spider in cast bronze
outside Canadian National Art Gallery
Ottawa, December 2007
outside Canadian National Art Gallery
Ottawa, December 2007