ఏనార్బర్ శిల్పాలు 3



ది క్యూబ్ (The Cube)

విశ్వవిద్యాలయంలో విద్యార్ధి కార్యకలాపాలకి ఆటపట్టు అనదగిన మిషిగన్‌ యూనియన్‌ అనే 19va శతాబ్ది భవంతి పక్కన చప్టాచేసిన జాగాలో ఉంటుంది ఈ ఆధునిక శిల్పం. మామూలుగా చూడ్డానికే ఈ కింది కొన మీద ఎలా నిలబడి ఉందా అని విభ్రాంతి కలిగిస్తోంది కదా .. ఇంకాస్తి విభ్రాంతి కలిగించే విషయం. అది ఆ మొన మీద మోపి ఉండడమే కాదు, ఆ ఇరుసు మీద గుండ్రంగా తిరుగుతుంది కూడా. పరీక్షలకి ముందు ఈ క్యూబుని ఒక చుట్టు తిప్పడం ఇక్కడి విద్యార్ధులు అదృష్టకరంగా భావిస్తారు.