బోర్డులు



విజయవాడ వన్ టౌను సెంటర్లో నాకు తెలిసిన మొదటి మాల్ ఇది. ఎప్పుడో 70 లలో కట్టారు. భవనం పేరు చాలా రొమాంటిగ్గా వస్త్రలత అని పెట్టారు. చేతి రుమాళ్ళ దగ్గర్నించి, అతి ఖరీదైన పట్టు చీరలు, సూట్ల వరకూ అమ్మే కొన్ని వందల బట్టల షాపులకి ఈ భవనం నివాసం.
జనవరి 2007

A mall of shops dedicated to all sorts of textiles, from handkerchiefs to the costliest wools and silks. The building, romantically titled "Vastralata", was built some time in the 70s. It is located in the main center of Vijayawada One Town.
January 2007

6 comments:

Ramani Rao said...

యెస్! ఇది నేనూ చూసాను.

కొత్త పాళీ said...

ఏం కొన్నారు?

Ramani Rao said...

మా అక్క బాబు బారసాల కని వాళ్ళ వాళ్ళకి ఎవో బట్టలు కొనాలంటే నేను మా బావగారు వెళ్ళాము. నాకు ఏదో డ్రెస్స్ తీసుకొన్నట్లున్నారప్పుడు, సరిగ్గా గుర్తు లేదు. మొత్తానికి ఓ 30 షాపులు తిప్పారు అక్కడికక్కడే, అలసిపోయి ఏదో పళ్ళరసం కూడా తాగాము అక్కడ. ఇదంతా నా పెళ్ళి కాకముందు జరిగింది.

Anonymous said...

హ హ ఇది వస్త్రలతేగా ?

Purnima said...

మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లో ఒకరు, వారింట్లో పెళ్ళిలు జరిగిన ప్రతీ సారీ, అన్నీ బట్టలూ ఇక్కడే కొంటారు. వాళ్ళ ఇల్లంతా అప్పుడు వస్త్రలత తాలూకూ కవర్లూ, పేపర్లతో నిండిపోయేది. పట్టు చీరలు మాత్రం వాహ్.. వాహ్ ఉన్నాయి.

అప్పటి నుండీ నాకూ ఈ ప్రదేశాన్ని చూడాలని కోరిక. మొత్తం అంతా బట్ల కొట్లేనట కదా?

విజయవాడలోని పుస్తకాల కొట్లను కూడా ఫొటో ముఖంగా పరిచయం చేయగలరు.

కొత్త పాళీ said...

అవును, బిల్డింగంతా బట్టల కొట్లే. ఆ కొట్ల వెరైటీ కూడా ఫొటోలోని బోర్డులద్వారా తెలుస్తోంది.
దురదృష్టవశాత్తూ నేనెళ్ళునప్పుడు ఏలూర్రోడ్డు వెడల్పు కార్యక్రమంలో పుస్తకాల కొట్ల ముందు భాగాలన్నీ కూల్చి ఉన్నాయి. ఫొటోతీసే సీను కాదు! లెనిన్ సెంటర్లో కొన్ని ఫొటోలు తీశాను కానీ పాత పుస్తకాల షాపుల్ని తియ్యాలని తట్టలేదు. ఈ సారి తీస్తాను!