జాలరి గూడెం



సెప్టెంబరు నించీ డిసెంబరు, జనవరి నెలల వరకూ జాలరులు ఇక్కడ చేపలు పట్టేందుకు వస్తారు. స్థానికులు ఎందుకో ఇక్కడ చేపలు పట్టరు. ఈ జాలరులు అటు విశాఖపట్నం, ఇటు విజయవాడ వంటి దూరాల్నించి వచ్చి, ఆ మూడు నాలుగు నెలలు గోదావరి గట్ల మీద ఇలాంటి గుడిసెలు వేసుకుని కాలక్షేపం చేస్తారు. సీజనులో ఉన్నప్పుడు అరుణోదయం కాకముందే నదిమీదకి వెళ్ళి, బాగా చీకటి పడ్డాక గానీ తిరిగి రారు. నాకిప్పుడు సరిగ్గా గుర్తు లేదు గానీ, ఈ చేపలు పట్టేందుకు కావలసిన పర్మిట్లు, ఇత్యాది గుత్తేదార్ల చేతిలో ఉన్నట్టు గుర్తు. అంటే జాలర్లకి మిగిలేది ఆ గుత్తేదారు ఇచ్చే కూలి డబ్బులే. చేపల వేటలో వచ్చే ఫలసాయం వ్యాపారికే!

A deserted fishing shack on the banks of the Godavari river
February 2003

3 comments:

Prashanth.M said...

nice description and an amazing picture!

never thought of this!

Rani said...

nice capture! and very good writeup

Ramani Rao said...

పాపం కదా! వాళ్ళ కష్టానికి తగ్గ ఫలం గుత్తేదారులదంటే, ఎందుకో బాధ అనిపిస్తొంది. పిక్చర్స్ మటుకు సుపర్బ్ గా ఉన్నాయి.